పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్‌ను కూల్చిన బీఎస్ఎఫ్..
పంజాబ్ గుర్దాస్పూర్‌లో భద్రతా సరిహద్దు దళాలు మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న డ్రోన్‌ను పట్టుకున్నాయి.
చంఢీగడ్: పంజాబ్ గుర్దాస్పూర్‌లో భద్రతా సరిహద్దు దళాలు మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న డ్రోన్‌ను పట్టుకున్నాయి. భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆదివారం ఉదయం వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ హెరాయిన్ డ్రగ్‌ను రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఈ డ్రోన్‌ను చైనా తయారు చేసినట్లు చెప్పారు.
దాదాపు 9 కేజీల వరకు రవాణా చేసే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉందన్నారు. అంకతుముందు రోజు పాకిస్తానీ స్మగ్లర్ల నుంచి 20 ప్యాకెట్ల హెరాయిన్‌ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సరిహద్దుల్లో అక్రమ రవాణా నియంత్రించేందుకు సైన్యం భద్రతను మరింత పటిష్టం చేసింది.