న్యూఢిల్లీ : ‘భారత్ న్యాయ్’ యాత్రకు రాహుల్‌గాంధీ రెడీ అవుతున్నారు. జనవరి 14 నుంచి జరగనున్న ఈ యాత్ర ఏర్పాట్లపై కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. మణిపూర్ నుంచి ముంబై వరకు జరిగే ఈ యాత్ర రూట్ మ్యాప్‌ను ఖరారు చేసేందుకు జనవరి 4న కీలక సమావేశం జరగనుంది. యాత్ర కొనసాగే 14 రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు మీటింగ్‌లో ‘భారత్ న్యాయ యాత్ర’ లోగోను ఎంపిక చేసి.. వెంటనే విడుదల చేస్తారు. జనవరి 8న యాత్ర రూట్ మ్యాప్‌ను, 12న యాత్ర థీమ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తారు. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా సాగుతుంది.