Bangladesh: వీలైనంత త్వరగా భారతీయులను తీసుకురండి: శివసేన (యుబిటి) ఎంపీ
బంగ్లాదేశ్‌లోని తాజా పరిస్థితులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం పార్లమెంట్‌లో చేసిన ప్రకటనపై శివసేన (యుబిటి) ఎంపీ, ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లోని తాజా పరిస్థితులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం పార్లమెంట్‌లో చేసిన ప్రకటనపై శివసేన (యుబిటి) ఎంపీ, ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ , బంగ్లాదేశ్‌లో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. కానీ ఈ ఘటనపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలుస్తుంది. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రతిపక్షం, ప్రభుత్వం కలిసి ఉంటాయి. అక్కడ ఉన్న భారతీయులను వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి తీసుకురావాలని అన్నారు. అలాగే షేక్ హసీనా రాజీనామాపై మాట్లాడుతూ, ఈ విషయంపై భారతదేశం ఆశ్చర్యపోయింది. ఆమె చివరగా ఉండాలనుకునే స్థలాన్ని ఎంచుకునే వరకు ఇక్కడే ఉండాలని కోరుకుంటుందని ప్రియాంక అన్నారు.
అంతకుముందు జైశంకర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో 19,000 మంది భారతీయ పౌరులు ఉన్నారని, వారిలో 9000 మంది విద్యార్థులు ఉన్నారని, అనేక మంది స్టూడెంట్స్ ఇప్పటికే గత నెలలో భారత్‌కు వచ్చారని తెలిపారు. ఢాకాలోని హై కమిషనర్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వదిలి భారత్‌కు వచ్చారు. ఆమె సైనిక విమానం సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగింది. హిండన్ ఎయిర్‌బేస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని భద్రత కోసం గరుడ కమాండోలను మోహరించారు.