BREAKING: తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి వృథాగా పోతున్న నీరు.. అధికారుల కీలక నిర్ణయం
కర్ణాటక, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ నిండు కుండలా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ నిండు కుండలా మారింది. ఈ క్రమంలోనే అధికారులు దిగువకు నీటిని విడుదల చేసేందుకు గేట్లును ఎత్తగా.. డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్ట్ నుంచి వరద నీరంతా వృథాగా పోతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేడు తుంగభద్ర డ్యామ్ వద్ద వెళ్లి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటు భాగాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.