BREAKING: ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. 57 లోక్‌సభ స్థానాలకు గాను పోలింగ్
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ ఇవాళ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ ఇవాళ విడుదల చేసింది. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు మే 25 న పోలింగ్ నిర్వహించనన్నుట్లు అధికారులు వివరించారు. బీహార్‌లో 8, హర్యానాలో 10, జార్ఖండ్ లో 4, ఒడిశాలో 6, ఉత్తర్ ప్రదేశ్ లో 14, పశ్చిమ బెంగాల్ లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది. సోమవారం నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.