BREAKING: రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

కేరళ రాష్ట్రాన్ని బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. మానర్కాడ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ (ఏవియన్‌ ఫ్లూ వేరియంట్) చాలా వేగంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Update: 2024-05-24 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కల్లోలాన్ని జనం మరువకు ముందే కేరళ రాష్ట్రాన్ని బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. మానర్కాడ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ (ఏవియన్‌ ఫ్లూ వేరియంట్) చాలా వేగంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కోళ్ల ఫారాలు ఉన్న ఒక కి.మీ పరిధిలో ఉన్న పెంపుడు పక్షులను వెంటనే చంపాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని కోడి, బాతు, పిట్ట, ఇతర పక్షుల పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయాలను ప్రభుత్వం ప్రస్తుతం నిషేధించింది. ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు రసయనాలు స్ప్రే చేస్తున్నారు. కోళ్ల ఫారం నుంచి 1 నుంచి 10 కి.మీ మేర పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించామని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా కొట్టాయం జిల్లాలో చికెన్, బాతు, పిట్ట, ఇతర పక్షుల పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకం, దిగుమతిపై నిషేధం విధించారు.

Tags:    

Similar News