BREAKING: తమిళనాడు ఎన్ఐఏ అధికారుల ఫోకస్.. ఏకకాలంలో 12 చోట్ల కొనసాగుతోన్న రెయిడ్స్
తమిళనాడులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు కలకలం రేపుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు కలకలం రేపుతున్నాయి. హిజ్బుత్ తహ్రీర్ కేసులో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రంలో పలుచోట్ల ముమ్మరంగా రెయిడ్స్ చేస్తున్నారు. చెన్నై, తిరుచ్చి, కుంభకోణంతో సహా 12 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్న పలువురు అనుమానితుల ఇళ్లను జల్లెడ పడుతున్నారు. సోదాల్లో భాగంగా అధికారులు కీలకమైన డేటా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా, దేశంలో షరియా చట్టం అమలుకు కుట్ర పన్నిన హిజ్బుత్ తహ్రీర్ అనే సంస్థ అమాయక ముస్లిం యువకులను ఆకర్షించి ఇస్లామిక్ రాడికల్స్‌గా వారిని మారుస్తున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు తమ అభియోగపత్రంలో పేర్కొన్నారు. అయితే, ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.