BREAKING : రేపు సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా! అవిశ్వాసానికి సిద్ధమవుతున్న ఆర్జేడీ
మహా కూటమి ప్రభుత్వం నుంచి నితీష్ కుమార్ వైదొలిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరడంపై దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: మహా కూటమి ప్రభుత్వం నుంచి నితీష్ కుమార్ వైదొలిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరడంపై దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రేపు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో కలిసి వేళతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అప్రమత్తమైన లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూడా తన సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
నితీష్ కుమార్ మళ్లీ సీఎం పీఠం ఎక్కకుండా చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 5న అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ఆ పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ అధనేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. నితీష్ కుమార్ INDIA కూటమితో ఉండి ఉంటే ఆయనే ప్రధాని అయ్యే అవకాశం ఉండేదని అన్నారు. ఇప్పటికీ ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఉత్సాహాన్ని ఏమాత్రం కోల్పోలేదని పేర్కొన్నారు.