బ్రేకింగ్: పతనం దిశగా ఇండియా కూటమి.. సీఎం నితీష్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇండియా కూటమిలో ఊహకు అందని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2024-01-25 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇండియా కూటమిలో ఊహకు అందని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ టార్గెట్‌గా ఏర్పడిన ఇండియా కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వెస్ట్ బెంగాల్‌లో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కూటమిలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. పంజాబ్‌లో ఇండియా కూటమితో ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాలూ కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వారసత్వ రాజకీయాలకు తాను పూర్తి వ్యతిరేకమని అన్నారు. రాహుల్ గాంధీ యాత్రకు కూడా హాజరు కాబోనని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ జత కట్టేందుకు రెడీ అవుతున్నారని టాక్. బిహార్ పరిణామాలపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లుగా తెలుస్తోంది. వీలైనంత తొందరలో అసెంబ్లీని రద్దు చేసి లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్నారని సమాచారం. మరో వైపు నితీష్ కుమార్ తీరుపై లాలూ కుమార్తె రోహిని ఫైర్ అయ్యారు. నితీష్ ఓ పచ్చి అవకాశవాది అంటూ ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News