BREAKING: భారీ వర్షానికి కుప్పకూలిన గౌహతి ఎయిర్‌పోర్ట్ సీలింగ్.. అదానీ సంస్థ మెయిన్‌టెనెన్స్‌పై నెటిజన్ల సెటైర్లు
భారీ వర్షానికి కూలిపోయిన గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎల్‌జీబీఐఏ) లోపల ఉన్న సీలింగ్‌లోని ఓ భాగం ప్రయాణికులపై నిన్న తెల్లవారుజామున కూలింది.
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షానికి కూలిపోయిన గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎల్‌జీబీఐఏ) లోపల ఉన్న సీలింగ్‌లోని ఓ భాగం ప్రయాణికులపై నిన్న తెల్లవారుజామున కూలింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ క్రమంలో గౌహతిలోని అదానీ గ్రూప్ మెయిన్‌టెనెన్స్‌లో ఉన్న ఎయిర్‌పోర్టు ఇలాంటి ఘటన జరగడం పట్ల ఆ సంస్థపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆ ఎయిర్‌పోర్టులోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా, అదానీ గ్రూప్ అక్టోబరు 2021లో గౌహతి ఎయిర్‌పోర్టు మెయిన్‌టెనెన్స్ బాధ్యతలను చేపట్టింది.
అస్సాం- భారీ వర్షాలకు కూలిపోయిన గౌహతి ఎయిర్ పోర్ట్.
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2024
గౌహతి ఎయిర్ పోర్ట్ మెయింటెనెన్స్ చూస్తున్న అదానికి చెందిన సంస్థ.. ఇదేమి మెయింటెనెన్స్ అంటూ నెటిజన్ల విమర్శలు. pic.twitter.com/Bpo2OmXUiR