BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జరిగింది అక్షరాల రూ.600 కోట్ల స్కామ్.. ఈడీ తరఫు న్యాయవాది వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులు సంచలన విషయాలను ఈడీ వెలుగులోకి తీసుకొస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులు సంచలన విషయాలను ఈడీ వెలుగులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అధికారులు అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాడివేడిగా వాదనలు సాగుతున్నాయి. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఏజీఎస్ రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలే అని వెల్లడించారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్‌కు లాభం చేకూర్చేలా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన చేశారని ఆయన కోర్టు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చేతులు మారింది రూ.100 కోట్లు కాదని అక్షరాల రూ.600 కోట్లని వెల్లడించారు. కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు కూడా సౌత్ గ్రూప్ ముట్టజెప్పిందని పేర్కొన్నారు. వచ్చి మొత్తాన్ని కూడా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందంటూ కోర్టుకు విన్నవించారు. హవాలా మార్గంలో రూ.45 కోట్లు చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి గోవాకు డబ్బులు చేరాయంటూ ఆరోపించారు. సౌత్ గ్రూప్, కేజ్రీవాల్‌కు విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపారు. ఈడీ అధికారులు తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరు కాలేదని తెలిపారు. కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన ఈడీ PMLA సెక్షన్-19 ప్రకారమే కేజ్రీవాల్ అరెస్టు చేశారని ఏజీఎస్ రాజు వాదించారు.