BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీఫ్.. పన్ను ఎగవేత కేసులో కీలక పరిణామం
లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీఫ్ లభించింది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీఫ్ లభించింది. రూ.3,567 కోట్ల పన్ను ఎగవేత కేసులో లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకు అంటే జూలై 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయ పన్ను శాఖ సుప్రీం కోర్టులో ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా, పొలిటికల్ పార్టీల ఫండ్స్‌కు ఐటీ శాఖ మినహాయింపును తొలగించినప్పటి నుంచి ఆ పార్టీ పన్ను బకాయిలు పెరుగుతూ వచ్చాయి. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.663 కోట్లు, మరో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.664 కోట్లు, 2016-17 ఫైనాన్షికల్ ఇయర్‌కు గాను రూ.417 కోట్ల పన్నును కలిపి మొత్త బకాయి రూ.1,745 కోట్లకు చేరుకుంది.
దీంతో ఆ పార్టీ చెల్లించాల్సిన పన్ను బకాయిల మొత్తం రూ.3,567 కోట్లుగా ఆదాయ పన్ను శాఖ లెక్కలు వేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి ఐటీ అధికారులు రూ.135 కోట్లను విత్‌డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్, హైకోర్టులను ఆశ్రయించినా చుక్కెదురైంది. దీంతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ తరుణంలో ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3,567 కోట్ల పన్ను ఎగవేత కేసులో లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకు వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయ పన్ను శాఖ సుప్రీం కోర్టులో ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది.