Hindenburg Report: దేశంలో అస్థిరత సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నం
హిండెన్ బర్గ్ పై కఠిన చర్యలు తీసుంటామని బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. స్టాక్ మార్కెట్లను కూల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నినట్లు బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్(Ravi Shankar Prasad) ఆరోపించారు
దిశ, నేషనల్ బ్యూరో: హిండెన్ బర్గ్ పై కఠిన చర్యలు తీసుంటామని బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. స్టాక్ మార్కెట్లను కూల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నినట్లు బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్(Ravi Shankar Prasad) ఆరోపించారు. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ సంస్థ నివేదికపై బీజేపీ నేత విమర్శలు గుప్పించారు. దేశంలో ఆర్థిక అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. భారత్‌పై ద్వేషం పెరిగేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ మార్కెట్లు చాలా సురక్షితంగా, నిలకడగా, ఆశాజనకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. మార్కెట్ సజావుగా సాగేలా చూసుకోవడం సెబీ చట్టపరమైన బాధ్యత అని గుర్తుచేశారు.
భారతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తున్నారు
కాంగ్రెస్ తో పాటు తన టూల్‌కిట్ ముఠా భారతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తున్నట్లు ఆరోపించారు. జులైలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగిందన్నారు. హిండెన్‌బర్గ్‌కు వ్యతిరేకంగా సెబీ నోటీసు జారీ చేసిందని పేర్కొన్నారు. కానీ, హిండెన్‌బర్గ్ ఈ ఆరోపణలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా నిరాధారమైన ఆరోపణలతో ప్రతిస్పందించిందని మండిపడ్డారు. ఇకపోతే, సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు మారిషస్ ఫండ్ లలో మాధబి, ఆమె భర్త వాటాలు తీసుకురున్నారని ఆరోపించింది. అయితే, మాదభి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ ఆరోపణలు నిరాధారమైననవని, ఎలాంటి నిజాలు లేవని ప్రకటించారు. దీనిపైనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.