BJP: జాతీయ పార్టీలకు విరాళాలు.. అత్యధికంగా బీజేపీకే

Update: 2025-04-07 15:31 GMT
BJP: జాతీయ పార్టీలకు విరాళాలు.. అత్యధికంగా బీజేపీకే
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పొందిన విరాళాల జబితాను అసోసియేటెడ్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ADR) వెల్లడించింది. గతేడాది బీజేపీకే అత్యధికంగా విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదికలో తెలిపింది. కాషాయ పార్టీకి రూ.2243 కోట్ల ఫండ్స్ సమకూరినట్లు పేర్కొంది. ఇక అన్ని పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం రూ.2,544.28 కోట్లుగా ఉంది. గత ఏడాది ఈ సంఖ్య రూ.12,547 కోట్లు. అయితే, గతేడాదితో పోలిస్తే 199 శాతం విరాళాలు పెరిగినట్లు ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వచ్చిన మొత్తం విరాళాల్లో ఒక్క కమలం పార్టీయే 88 శాతం దక్కించుకుంది. విరాళాల్లో 211 శాతం పెరుగుదల కనిపించింది.

రెండోస్థానంలో కాంగ్రెస్

కాగా.. ఏడీఆర్ నివేదిక ప్రకారం రూ.281.48 కోట్లతో కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీకి తక్కువ విరాళాలు వచ్చినట్లు తెలిపింది. బహుజన్ సమాజ్ పార్టీ (BSP) మరోసారి తమకు ఎలాంటి విరాళాలు రాలేదని ప్రకటించింది. ఇకపోతే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.719.858 కోట్ల విరాళాలు రాగా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,243.94 కోట్లకు పెరిగింది. ఇది 211.72 శాతం పెరుగుదలను సూచిస్తుంది. అదేవిధంగా, కాంగ్రెస్‌కు విరాళాలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.79.924 కోట్ల విరాళాలు రాగా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.281.48 కోట్లకు పెరిగాయి. ఇది 252.18 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుందని నివేదిక తెలిపింది.

Tags:    

Similar News