'జగన్నాథుడు మోడీ భక్తుడు'.. నోరు జారిన బీజేపీ నేత.. పశ్చాత్తాపంగా ఉపవాసం
బీజేపీ నేత సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సోమవారం ఒడిశాలోని పూరిలో ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించారు
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేత సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సోమవారం ఒడిశాలోని పూరిలో ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించారు. దీని తర్వాత మీడియా సమావేశంలో సంబిత్ పాత్ర మాట్లాడుతూ, ఈ పురాతన పట్టణంలో కొలువుదీరిన జగన్నాథుడు ప్రధాని మోడీ భక్తుడని పొరపాటున నోరు జారారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీశాయి. బీజేపీ వ్యతిరేక పార్టీల నుంచి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్ (బీజేడీ) నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
దీనిపై వివరణ ఇచ్చిన సంబిత్ పాత్ర, నేను చేసిన ప్రకటన వివాదాన్ని సృష్టించింది. పూరీలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో తర్వాత, నేను చాలా మీడియా చానెళ్లతో మాట్లాడాను. ప్రతి చోటా కూడా జగన్నాథుడికి మోడీ పరమభక్తుడు అని చెప్పాను, కానీ ఒక్క చోట అనుకోకుండా తప్పు మాట్లాడాను, ఇది చాలా మందిని బాధించింది. నేను జగన్నాథునిపై ప్రధాని మోడీకి ఉన్న భక్తిని తెలియజేయాలని చూశాను, కానీ పొరపాటున జగన్నాథ్ మోడీ భక్తుడు అని అన్నాను, అనుకోకుండా ఈ తప్పు చేశాను, దేవుడు కూడా అనుకోకుండా చేసిన తప్పులను క్షమిస్తాడు. ఇలా తప్పుగా మాట్లాడినందుకు పశ్చాత్తాపంగా ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.
సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు 'మహాప్రభు' జగన్నాథుని పవిత్రతను అవమానపరుస్తాయి, లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఎక్స్ పోస్ట్‌లో ఖండించారు. రాజకీయ చర్చల్లోకి దేవుళ్లను లాగడం మానుకోవాలని ఆయన బీజేపీని కోరారు.
Read More..
లాయర్స్‌నే బురిడీకొట్టించిన సైబర్ కేటుగాళ్లు.. కేదార్‌నాథ్ దర్శనానికి ఫేక్ టికెట్స్!