బీజేపీ భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోంది: ఏఐసీసీ చీఫ్ ఖర్గే

బీజేపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భావోద్వేగపరమైన అంశాలను తెరపైకి తెస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

Update: 2024-01-04 09:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భావోద్వేగపరమైన అంశాలను తెరపైకి తెస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. దేశవ్యాప్తంగా గురువారం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాషాయపార్టీ ఉద్దేశపూర్వకంగానే ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ను ఇన్వాల్వ్ చేస్తుందని విమర్శించారు. బీజేపీ చెప్తున్న అబద్దాలు, మోసపూరిత మాటలను ఐక్యంగా ఎదుర్కొని తగిన సమాధానం చెప్పాలని సూచించారు. పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు ఉండొద్దని తెలిపారు. అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని, అంతేకానీ మీడియాలో వాటిని ప్రస్తావించొద్దని చెప్పారు. ప్రస్తుతం జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టినందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అభినందించారు. అలాగే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టబోయే భారత్ న్యాయ్ యాత్ర కూడా విజయవంతం అవుతుందని దీమా వ్యక్తం చేశారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, భారత్ న్యాయ యాత్రపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక గాంధీ సహా పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు.

Tags:    

Similar News