బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన లేదు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.

Update: 2024-03-16 06:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన కాషాయ పార్టీకి తెలిపారు. హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని కొట్టి పారేశారు. గడ్కరీ శనివారం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. హెగ్డే వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని చెప్పారు. ‘రాజ్యాంగ సవరణతో కాంగ్రెస్ అనవసరమైన విషయాలను బలవంతంగా చేర్చింది. ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణచి వేయడానికి చట్టాలు తీసుకొచ్చింది. ఇవన్నీ మార్చాల్సి ఉంటుంది’ అని చెప్పారు. ‘పార్లమెంటులో బీజేపీకి అత్యధిక మెజారిటీ ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలంటే పెద్ద పనేమీ కాదు. కానీ దానిని మార్చబోము’ అని స్పష్టం చేశారు. తమకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని గుర్తు చేశారు.

కాగా, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ..తాము మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తప్పకుండా మారుస్తాం అని చెప్పారు. దీంతో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పించాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందిస్తూ..బీజేపీ రాజ్యాంగ విరోధి అని తెలిపారు. హెగ్డే వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని మండిపడ్డారు. దీనిపై వెంటనే బీజేపీ క్లారిటీ ఇచ్చింది. అంతేగాక హెగ్డే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. అయితే 2007లోనే హెగ్డే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అనంత్‌కుమార్‌కు బీజేపీ బీజేపీ లోక్ సభ టికెట్ నిరాకరించినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News