CPM బెంగాల్‌ రికార్డును సమం చేసిన బీజేపీ

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ హావా కొనసాగిస్తోంది.

Update: 2022-12-08 07:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ హావా కొనసాగిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి దూసుకుపోతోంది. కమలం జోరుకు కాంగ్రెస్ కకావికలం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతం కంటే ఈ సారి హస్తం పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోవడం వెనుక రాజకీయంగా అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగుతూ వస్తున్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అదే తమకు కలిసి వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీకి.. బీజేపీ బలంతో పాటు ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలో కోలుకోలేని దెబ్బేశాయనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓట్లను కేజ్రీవాల్, ఓవైసీ పార్టీలు భారీగా చీల్చినట్టు వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే అర్థం అవుతోంది. నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల, మోర్బీ ఘటన వంటి అంశాలను కాంగ్రెస్ ఫోకస్ చేసినా గతంలో కంటే ఈ సారి గుజరాత్ లో బీజేపీ ఎక్కువ ఓట్లు పోలవడం ఆసక్తిగా మారింది. ఈసారి బీజేపీకి 53.50 శాతం ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. గతంలో 2014లో కమలానికి 49.10 శాతం ఓట్లు మాత్రమే రాగా ఈ సారి ఏకంగా 4 శాతం అధికంగా ఎక్కువ ఓట్లు సాధించుకోవడంలో మోడీ, అమిత్ షా ద్వయం సక్సెస్ అయింది.

అయితే, కాంగ్రెస్‌కు ఓటింగ్ శాతం పడిపోవడానికి ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు ప్రధాన పాత్ర పోషించాయనే టాక్ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఇక్కడ అధికార బీజేపీ 182 స్థానాల్లో పోటీ చేయగా గుజరాత్ యుద్ధభూమిలోకి తొలిసారి రంగ ప్రవేశం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 181 స్థానాల్లో పోటీ చేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 179 స్థానాల్లో పోటీ చేయగా దాని కూటమి భాగస్వామి అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ రెండు చోట్ల బరిలో నిలిచింది. అసద్దుదిన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ 13 స్థానాల్లో పోటీ చేసి గట్టి ప్రయత్నమే చేసింది. కాంగ్రెస్ ఓట్ల చీలకలో ఎంఐఎం, ఆమ్ ఆద్మీ కీలక భూమిక పోషించిందని వీటి కారణంగా బీజేపీ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భుజ్ నియోజకవర్గంలో కేశూభాయ్ శివదాస్ పటేల్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇక్కడ అనూహ్యంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థి సకిల్ మహమ్మద్ సామా రెండో స్థానంలో కొనసాగడం గమనార్హం. గత ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 77, ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. కానీ ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం గుజరాత్ లో బీజేపీ 154 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతలో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ 6 చోట్ల, స్వతంత్రులు మరో 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఫలించిన మోడీ, అమిత్ షా ప్రయోగం:

గుజరాత్ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ సత్తా చాటడం వెనుక ఆ పార్టీ అనేక ప్రయోగాలను చేసింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు గతంలో కంటే భిన్నంగా ఇక్కడ ఫోకస్ పెట్టారు. అలాగే పార్టీ పరంగా అనేక మార్పులు చేయడం.. ఆ పార్టీ విజయంలో కీలకంగా మారినట్టు తెలుస్తోంది. 44 మంది సిట్టింగ్ లకు బీజేపీ ఈ సారి టికెట్లు ఇవ్వలేదు. 17 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఇందులో 11 మంది కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థులు కావడం విశేషం. అలాగే కాంగ్రెస్ కు అండగా నిలుస్తూ వస్తున్న వర్గాలైన ట్రైబల్స్, అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్, పటీదార్ వర్గాలను ఈ సారి బీజేపీ తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఇందు కోసం మోడీ స్వయంగా తన ప్రసంగాల్లో ఈ వర్గాలను పదే పదే ప్రస్తావించడం తెలిసిందే. దీంతో ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య పోలైన ఓటింగ్ శాతంలో తేడా 7 శాతమే ఉండగా ఈ సారి ఆ తేడా భారీగా నమోదవుతోంది.

వామపక్షాల రికార్డు సమమం:

ఇక ఈసారి గుజరాత్ లో బీజేపీ నమోదు చేసుకోబోయే గెలుపు వామపక్షాల రికార్డును సమం చేయబోతోంది. 27 ఏళ్లుగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా ఏడోసారి అధికారంలోకి రాబోతోంది. ఈ సారి అధికార పీఠం ఎక్కడం ద్వారా పశ్చిమబెంగాల్ లో వామపక్ష కూటమి పేరుపై ఉన్న రికార్డును బీజేపీ ఈక్వల్ చేయబోతోంది. బెంగాల్ లో వామపక్షాల కూటమి వరుసగా ఏడు సార్లు గెలిచి అధికారంలో కొనసాగింది.

Also Read....

గుజరాత్ రిజల్ట్స్.. Modi, Amit Shah కీలక నిర్ణయం! 

Tags:    

Similar News