త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో సునామి సృష్టించిన బీజేపీ
2024 పార్లమెంట్ ఎన్నికల్లో పలు ఎంపీ స్థానాలు కోల్పోయిన బీజేపీ.. త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో సునామి సృష్టించింది. కమ్యునిష్టుల కంచుకోటలో అధికారం చేపట్టిన ఆ పార్టీ.. ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం హవా కొనసాగించింది.
దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పలు ఎంపీ స్థానాలు కోల్పోయిన బీజేపీ.. త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో సునామి సృష్టించింది. కమ్యునిష్టుల కంచుకోటలో అధికారం చేపట్టిన ఆ పార్టీ.. ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం హవా కొనసాగించింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 71 శాతం స్థానాలను ఏకగ్రీవం చేసింది. అంటే గ్రామ పంచాయితీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌లలో మొత్తం 6,889 స్థానాలకు గాను బీజేపీ 4,805 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి అసిత్ దాస్ తెలిపారు. పోలింగ్ జరిగిన మిగిలిన 1,819 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా వీటికి సంబంధించిన ఫలితాలు విడుదల కాగా.. మొత్తం 6,370 గ్రామ పంచాయతీలకు గాను 5,946 స్థానాలు బీజేపీ గెలవగా ఇండియా కూటమి 301, ఇతరులు 122 స్థానాల్లో గెలుపొందారు. అలాగే 423 పంచాయితీ సమితీలకు ఎన్నికలు జరగ్గా.. అందులో 407 స్థానాల్లో బీజేపీ విజయం సాదించింది. ఇండియా కూటమి కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇతరులు ఒక్క చోట గెలిచారు. అలాగే 116 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 113 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయకేతంన ఎగురవేయగా.. ఇండియా కూటమి కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలపై బీజేపీ పార్టీ స్పందిస్తూ.. ఇంతటి భారీ విజయాన్ని అందించిన త్రిపుర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ప్రకటించారు.