రా‘బంధువుల’ ఘాతుకం.. భార్య, భర్త, రెండేళ్ల బిడ్డ దారుణ హత్య

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్‌లోని నౌగాచియా పట్టణం పరిధిలో ఉన్న ఒక గ్రామంలో బుధవారం ఘోరమైన మర్డర్స్ జరిగాయి.

Update: 2024-01-11 17:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్‌లోని నౌగాచియా పట్టణం పరిధిలో ఉన్న ఒక గ్రామంలో బుధవారం ఘోరమైన మర్డర్స్ జరిగాయి. ఇద్దరు దంపతులు వారి రెండేళ్ల కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. సమీప బంధువులే ఇనుప రాడ్లతో కొట్టి తుపాకులతో షూట్ చేసి ఆ ముగ్గురిని పాశవికంగా కడతేర్చారు. వివరాల్లోకి వెళితే.. చందన్‌కుమార్, చాందిని కుమారి అనే ప్రేమజంట 2021లో ఊరి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె కలిగింది. ఊరిలో ఉంటున్న చందన్ తండ్రి ఆరోగ్య సమస్యలతో మంచంపట్టాడు. దీంతో తండ్రిని చూసేందుకు చందన్ కుమార్ తన భార్య చాందిని కుమారి, రెండేళ్ల బిడ్డను తీసుకొని ఊరికి వచ్చాడు. తన తండ్రిని చందన్ కుమార్ పరామర్శించాడు. ఈవిషయం తెలియడంతో చాందిని కుమారి తండ్రి, సోదరుడు తుపాకులు, ఇనుప రాడ్లతో అక్కడికి చేరుకున్నారు. చందన్ కుమార్ తన ఫ్యామిలీతో తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో అడ్డుకున్నారు. వారిపై ఇనుప రాడ్లతో దాడిచేసి, తుపాకులతో కాల్చి చంపారు.

Tags:    

Similar News