మాంసం ప్రియులకు బిగ్ షాక్.. జూన్ 4వ తేదీ వరకు చికెన్, మటన్ బంద్
మాంసం ప్రియులకు షాక్ ఇస్తూ సిక్కిం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: మాంసం ప్రియులకు షాక్ ఇస్తూ సిక్కిం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. మే 27 నుంచి జూన్ 4వ తేదీ వరకు మాంసం విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఎవరైనా వ్యాపారులు, సాధారణ ప్రజలు ఉల్లంఘిస్తే రూ.1000 వరకు జరిమానా విధిస్తామని అధికారులు వెల్లడించారు.
అలాగే పెళ్లి వేడుకలు, ఇతర ఫంక్షన్స్ ఉంటే మాంసం పెట్టాలనుకుంటే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని కండీషన్ పెట్టింది. బౌద్ధ క్యాలెండర్ ప్రకారం అక్కడ ‘సాగ దవా’ అనే పవిత్ర మాసం ప్రారంభం కావడం వల్ల చికెన్, మటన్ విక్రయాలను బంద్ చేసినట్టు వేదాంత శాఖ వారు తెలిపారు. ఈ క్యాలెండర్‌ను టిబేటన్ ప్రజలు అనుసరిస్తారని సమాచారం. అయితే చేపల విక్రయాలకు మాత్రం మినహాయింపు ఉందని అధికారులు పేర్కొన్నారు.