BIG BREAKING : వివాదాస్పద జ్ఞాన‌వాపి, షాహీ ఈద్గా నిర్మాణాలను హిందువులకు అప్పగించండి : ఏఎస్ఐ డైరెక్టర్ కే.కే మహ్మద్ సంచలన వ్యాఖ్యలు

వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు స్థానంలో హిందూ దేవాలయం ఉండేదని, ఆ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారంటూ కొందరు హిందూ మహిళ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-01-23 12:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు స్థానంలో హిందూ దేవాలయం ఉండేదని, ఆ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారంటూ కొందరు హిందూ మహిళ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు మసీదులో సర్వే జరిపితే వాస్తవం బయటపడుతుందని పిటీషనర్ల వాదన మేరకు వారణాసి కోర్టు సర్వేకు అనుమతిచ్చింది. అయితే, కోర్టు తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. తాత్కాలిక స్టే విధిస్తూ అలహాబాద్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. న్యాయపరమైన ప్రయోజనాలకై సర్వే అవసరముందని అలహాబాద్ కోర్టు అభిప్రాయపడింది. సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఇప్పుడు అలహాబాద్ కోర్టు జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకు అనుమతిచ్చింది.

సెషన్స్ కోర్టు తిర్పును సమర్ధించి, మసీదు కమిటీ పిటీషన్‌ను కొట్టివేసింది. అదేవిధంగా మసీదులో చేపట్టిన సైంటిఫిక్ సర్వే నివేదికను అర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సీల్డ్ కవర్‌లో అలహాబాద్ కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఏఎస్ఐ (అర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి) డైరెక్టర్ కే.కే మహ్మద్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వివాదాస్పద జ్ఞానవాపి, షాహీ ఈద్గా నిర్మాణాన్ని ముస్లింలు హిందువులకు అప్పగించాలి’ అంటూ జ్ఞానవాపి, షాహీ ఈద్గా ఫొటోలను జత చేస్తూ ట్వీట్ చేశారు. కే.కే మహ్మద్ రామ జన్మభూమికి సంబంధించి 12 స్తంభాలతో పాటు హిందూ దేవాలయాలను పోలిన శాసనాలు ఉన్నాయని కీలక పరిశోధనలు చేసిన వారిలో ఒకరు. కాశీ, మధుర, అయోధ్య హిందువులకు చాలా ప్రత్యేకమని మహ్మద్ పేర్కొన్నారు. అక్కడ నిర్మించిన మసీదుల పట్ల ముస్లింలకు ఎలాంటి మనోభావాలు లేవని మహ్మద్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News