Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌లో సామన్యులకు భారీ ఊరట.. తగ్గనున్న మొబైల్స్ ధరలు
2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటిని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో త్వరలో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. అలాగే పలు రకాల మెడిసిన్, వైద్య పరికారాలకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బంగారం, వెండి పై కస్టమ్స్ డ్యూటిని 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రటకించారు. దీంతో త్వరలో బంగారం ధరలు కూడా తగ్గనున్నాయి.