వామ్మో.. బసవన్నకు కోపం వచ్చింది! గుద్ది ట్రక్ కిందకి పడేసింది!
కర్నాటకలో ఓ గంగిరెద్దు ఢీ కొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ట్రక్ కిందకి పడిపోతాడు. కింద పడిన వెంటనే ట్రక్ డ్రైవర్ బండి ఆపేస్తాడు. దీంతో అదృష్టవశాత్తూ, బైకర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్నాటకలో ఓ గంగిరెద్దు ఢీ కొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ట్రక్ కిందకి పడిపోతాడు. కింద పడిన వెంటనే ట్రక్ డ్రైవర్ బండి ఆపేస్తాడు. దీంతో అదృష్టవశాత్తూ, బైకర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ స్విమ్మింగ్ పూల్ జంక్షన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సోషల్ మీడియా యూజర్ సీసీ టీవీ ఫుటేజ్ వీడియో పోస్ట్ చేశారు. గంగిరెద్దు ఒక మహిళతో నడుస్తూ కనిపించింది. ఈ క్రమంలోనే అటుగా వస్తున్న ఒక బైకర్‌పై సడెన్‌గా ఢీ కోట్టి పారిపోతుంది.
దీంతో బైకర్ ఎదురుగా వస్తున్న ట్రక్కు కిందకు పడుతాడు. వెంటనే ట్రక్ డ్రైవర్ అప్రమత్తం అయ్యి బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పినట్లవుతుంది. ఇది గమనించిన స్థానికులు బైకర్‌కు సహాయపడుతారు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్రక్ డైవర్ అప్రమత్తంగా ఉండటం వల్లే తను బతికాడని ట్రక్ డ్రైవర్‌ను అభినందిస్తున్నారు. మరికొంత మంది గంగిరెద్దుకు కోపం వచ్చిందని, యముడు లీవ్‌లో ఉన్నారని, కాబట్టి తను బతికాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.