Bangladesh voilance: బంగ్లాదేశ్ అల్లర్ల ఎఫెక్ట్.. సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్ !

బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఉధృతం కావడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి.

Update: 2024-08-05 11:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఉధృతం కావడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ అధికారులు సోమవారం హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు వద్ద భద్రతను సమీక్షించడానికి బీఎస్ఎఫ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ దల్జీత్ చౌదరి సీనియర్ అధికారులతో కలిసి కోల్‌కతా చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ఎవరైనా అనధికారికంగా ప్రవేశించడాన్ని నిశితంగా పరిశీలించాలని, స్మగ్లర్లు, ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ప్రస్తుత పరిస్థితిని సద్వినియోగం చేసుకోకుండా చూసుకోవాలని బీఎస్ఎఫ్ జవాన్లను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేగాక బంగ్లాదేశ్ సరిహద్దులో మోహరించిన జవాన్లకు సెలవులు సైతం రద్దు చేసినట్టు సమాచారం. కాగా , బంగ్లాదేశ్‌తో భారత్ 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు కలిగి ఉంటుంది. ప్రస్తుత పరిణామాలను ఉపయోగించుకుని దుండగులు, ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని బీఎస్ఎఫ్ హెచ్చరించింది.

Tags:    

Similar News