ఇండోర్‌లో Sharukh Khan కు షాకిచ్చిన బజరంగ్ దళ్..

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా అనేక వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే.

Update: 2023-01-25 07:53 GMT
ఇండోర్‌లో Sharukh Khan కు షాకిచ్చిన బజరంగ్ దళ్..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా అనేక వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పఠాన్ సినిమా విడుదలను హిందూ సంఘాలు అడ్డుకుంటామని ముందుగానే హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఈ రోజు పఠాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే హిందూ సంఘాలు ఎక్కడికక్కడ ఈ సినిమా ఆడకుండా అడ్డుకుంటున్నాయి.

మహారాష్ట్రలోని ఇండోర్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు సినిమా హాల్ లోపలికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సినిమా నిలిపి వేసి హనుమాన్ చాలీసా పఠించారు. దీంతో అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు బజరంగ్ దళ్ సభ్యులు కర్రలతో థియేటర్ ముందు భారీ సంఖ్యలో గుమిగూడారు. దీంతో థియేటర్ యాజమాన్యం గేట్లు మూసి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి : Shahrukh Khan 'పఠాన్' రిలీజ్.. థియేటర్ల వద్ద హిందూ సంఘాల నిరసన (వీడియో)

Tags:    

Similar News