Badlapur Encounter: బద్లాపూర్ ఎన్ కౌంటర్ లో బాంబై హైకోర్టు కీలక ఆదేశాలు
మహారాష్ట్రలోని బద్లాపూర్ ఎన్ కౌంటర్(Badlapur Encounter) కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని బద్లాపూర్ ఎన్ కౌంటర్(Badlapur Encounter) కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుత ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్ర చట్టబద్ధత, నేర న్యాయ వ్యవస్థపై సామాన్యుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, నిందితుడి మృతి వెనుక ఉన్న కుట్రను సిట్ బయటపెడుతుందని నమ్ముతున్నట్లు తెలిపింది. కాగా.. లైంగిక వేధింపుల లాంటి ఘటనలు జరిగినప్పుడు నిబంధనలకు కట్టుబడి దర్యప్తు జరిగేల చర్యలు తీసుకోవడం పోలీసుల విధి అని పేర్కొంది. కాగా.. ఈ కేసుని సీఐటీ దర్యాప్తు చేస్తోందనని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ కేసుపై విస్తృత దర్యాప్తుకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసిందని వెల్లడించారు. సీఐడీ దర్యాప్తు ముగిసిన తర్వాత, సంబంధిత కోర్టుకు నివేదికను సమర్పిస్తామని అన్నారు.
బద్లాపూర్ రేప్ కేసు
బద్లాపుర్ లోని ప్రైవేటు స్కూల్ లో జరిగిన లైంగిక వేధింపుల కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా.. ఈ కేసు విచారణ సమయంలో నిందితుడు అక్షయ్ షిండే (23) ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. కాగా.. దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. అతడి మొదటి భార్య పెట్టిన కేసులో ప్రశ్నించేందుకు తలోజా జైలుకు వెళ్లామని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి నిందితుడిని కారులో తీసుకొని బద్లాపుర్‌కు బయలుదేరగా.. ముంబ్రా బైపాస్‌కు చేరుకున్న సమయంలో కారులో ఉన్న పోలీసు అధికారి తుపాకీని లాక్కొన్న అక్షయ్ వారిపై కాల్పులకు తెగబడ్డాడని వివరించారు. దీంతో ఆత్మరక్షణ కోసం ఓ పోలీస్ అధికారి నిందితుడిపై కాల్పులు జరిపినట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. కాగా.. మెజిస్ట్రేట్ విచారణలో పోలీసుల కస్టడీలో నిందితుడు మరణించినట్లు తేలింది.
Read More..