మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో రామ్‌దేవ్ బాబా

ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి బాబా రామ్‌దేవ్ హాజరయ్యారు.

Update: 2022-11-26 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి బాబా రామ్‌దేవ్ హాజరయ్యారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన యోగా సదస్సుకు మహిళలు యోగా దుస్తులు ధరించి రాగా.. కార్యక్రమం అనంతరం సాధారణ సమావేశానికి హాజరయ్యేందుకు చీరలను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. సల్వార్ సూట్‌లలో కూడా అందంగా కనిపిస్తారు. నాలాగా ఏమి ధరించకపోయినా అందంగా ఉంటారు.." అని అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. చీర కట్టుకోవడానికి సమయం లేకపోయినా పర్వాలేదని.. ఇంటికి వెళ్లి చీరకట్టుకోవాలని సూట్ ధరించిన మహిళలకు సూచించారు. అంతేగాక, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఆయనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.




Also Read......


వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Tags:    

Similar News