ఢిల్లీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
డిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ రాజీనామాలతో ఏర్పడిన మంత్రి పదవి ఖాళీలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భర్తీ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: డిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ రాజీనామాలతో ఏర్పడిన మంత్రి పదవి ఖాళీలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భర్తీ చేశారు. ఈ మేరకు ఢిల్లీ కొత్త మంత్రులుగా అతిషి, సౌరభ్ భరద్వాజులను ఎంపిక చేయగా.. గురువారం వారిద్దరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భరద్వాజ్ కు హెల్త్, పట్టాణాభివృద్ధి, నీటి సరఫరా, పరిశ్రమల శాఖలు కట్టబెట్టగా.. కొత్తగా మంత్రిగా ఎంపికైన అతిషికి విద్య, పీడబ్ల్యూడీ, విద్యుత్, టూరిజం శాఖలు అప్పగించారు.
ఇద్దరూ కూడా క్యాబినెట్ బెర్తులు దక్కించుకోగా.. భరద్వాజ్ రెండోసారి మంత్రి పదవిని చేపట్టారు. ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో మనీశ్ సిసోడియాకు అడ్వైజర్ గా వ్యవహరించిన అతిషి అనూహ్యంగా మంత్రి పదవిని చేపట్టారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైలులో ఉన్నారు.