EC : అసెంబ్లీ ఎన్నికలు.. కొరడా ఝుళిపించిన ఈసీ
మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్(Jarkhand) రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) నేపథ్యంలో పలువురు నేతలపై ఎన్నికల సంఘం(EC) సీరియస్ అయింది.
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్(Jarkhand) రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) నేపథ్యంలో పలువురు నేతలపై ఎన్నికల సంఘం(EC) సీరియస్ అయింది. అధికార, విపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు హద్దులు మీరుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ అగ్రనాయకులకు సైతం నోటీసులు జారీ చేసింది. బీజేపీ నాయకులు అమిత్ షా(Amith Sha), జేపీ నడ్డా(JP Nadda)కు.. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ(Rahul Gandhi), మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge)కు.. ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. జాతీయ పార్టీల క్యాంపెయినర్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ఈ సందర్భంగా ఈసీ ఇరు పార్టీల నేతలకు హితవు పలికింది.