ఉద్యోగులకు అసోం సర్కార్ గుడ్‌న్యూస్.. పేరెంట్స్‌తో గడిపేందుకు ఆ రెండ్రోజులు సెలవు

ప్రభుత్వ ఉద్యోగులకు అసోం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు వారి తల్లిదండ్రులు లేదా అత్తమామలతో సమయం గడిపేందుకు నవంబర్‌లో రెండు రోజుల ప్రత్యేక క్యాజువల్ లీవ్‌లను ప్రకటించింది.

Update: 2024-07-11 17:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు అసోం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు వారి తల్లిదండ్రులు లేదా అత్తమామలతో సమయం గడిపేందుకు నవంబర్‌లో రెండు రోజుల ప్రత్యేక క్యాజువల్ లీవ్‌లను ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 6, 8 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే తల్లిదండ్రులు లేని వ్యక్తులు సెలవులకు అనర్హులని పేర్కొంది. వ్యక్తిగత విశ్రాంతి కోసం ప్రత్యేక ఆఫ్‌లను ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ఈ సెలవును వృద్ధాప్య తల్లిదండ్రులు లేదా అత్తమామలతో సమయం గడపడం కోసం మాత్రమే ఉపయోగించాలని, వారిని గౌరవించడం, వారిపై శ్రద్ధ వహించడం కోసం తప్ప ప్రత్యేక పనుల కోసం వాడుకోవద్దని వెల్లడించింది. అయితే 7వ తేదీ ఛత్‌ పూజ , 9వ తేదీ రెండో శనివారం కావడంతో ఉద్యోగులకు మొత్తం నాలుగు రోజులు కలిసి రానున్నాయి.


Similar News