పాక్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. కశ్మీర్‌లో ‘ఆపరేషన్ సర్వశక్తి’

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూ కాశ్మీర్‌‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు బ్రేక్ వేసేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సర్వశక్తి’ని ప్రారంభించింది.

Update: 2024-01-13 18:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూ కాశ్మీర్‌‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు బ్రేక్ వేసేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సర్వశక్తి’ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కాశ్మీర్‌‌లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణులకు ఇరువైపులా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ చేయనుంది. శ్రీనగర్‌లోని చినార్ కార్ప్స్‌, నగ్రోటాలోని వైట్ నైట్ కార్ప్స్‌ కలిసి ఈ ప్రాంతాలలో ఏకకాలంలో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను చేపట్టనున్నాయి. ముఖ్యంగా పాక్ బార్డర్‌లోని రాజౌరీ, పూంచ్ సెక్టార్ల మీదుగా ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను నిలువరించేందుకు పోలీసులు, సీఆర్‌‌పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయనున్నాయి.

Tags:    

Similar News