మోడీ ప్రభుత్వం నా దేశాన్ని అవమానించిందంటూ ఆప్ ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి..latest telugu news
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. దీంతో ఆమెను పార్టీ నుంచి హైకమాండ్ సస్పెండ్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. మోదీ కారణంగా గొప్ప దేశమైన భారతదేశం అవమానాన్ని ఎదుర్కొంటోందని ఆప్ ట్వీట్లో పేర్కొంది. "నా భారతదేశం గొప్పది. మోదీ వల్ల అవమానాన్ని భరిస్తున్నారు'' అని ఆప్ తన ప్రధాన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. కాగా, సౌదీ అరేబియా, ఇరాన్‌తో సహా పశ్చిమాసియా దేశాలు నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఆప్ ఈ ట్వీట్ చేసింది.
मेरा भारत महान 🇮🇳
— AAP (@AamAadmiParty) June 6, 2022
मोदी की वजह से सह रहा अपमान।#ModiShamesIndia