బిగ్ బ్రేకింగ్: ఒడిషాలో పట్టాలు తప్పిన మరో ట్రైన్

ఒడిషాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Update: 2023-06-05 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 280 మంది వరకు మరణించగా.. మరో 1000 మంది ప్రయాణికులకు పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనలో సహయక చర్యలు కొనసాగుతుండగా.. అదే ఒడిషా రాష్ట్రంలో మరో ట్రైన్ పట్టాలు తప్పడం సంచలనంగా మారింది. సోమవారం ఒడిషాలో మరో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది.

బారాగఢ్‌ జిల్లాలో ఈ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గూడ్స్ రైలు ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. సున్నపు రాయి లోడ్‌తో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అటు వైపు నుంచి రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్నఅధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. పక్కకు ఒరిగిన బోగీలను ట్రాక్‌పై నుండి తొలగిస్తున్నారు. ఈ గూడ్స్ రైలు ప్రమాదం వల్ల ఆ రూట్‌లో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Also Read:   మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు.. చైన్ లాగడంతో

Tags:    

Similar News