కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య : మూడు నెలల్లోనే ఏడో ఘటన

జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ హబ్‌గా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడగా తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-03-26 09:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ హబ్‌గా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడగా తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన ఉరుజ్ ఖాన్ అనే విద్యార్థి కోటాలోని విజ్ఞాన్ నగర్ ప్రాంతలో ఉంటూ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి తను అద్దెకు ఉండే నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోటీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఉరుజ్ ఖాన్ చాలా రోజుల నుంచి కోటాలో ఉంటున్నప్పటికీ 20రోజుల క్రితమే విజ్ఞాన్ నగర్‌కు వచ్చినట్టు తెలిపారు. ఈ ఏడాది ఇది ఏడో ఘటన కావడం గమనార్హం. 2023లోనూ దాదాపు 26 మందికి పైగా విద్యార్థులు కోటాలో సూసైడ్‌కు పాల్పడ్డారు. దీనిపై ఆందోళనలు రావడంతో కేంద్రం పలు మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ విద్యార్థులు చావులు ఆగకపోవడం గమనార్హం. 

Tags:    

Similar News