ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరి అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా బ్రిండ్‌కో సేల్స్ డైరెక్టర్ అమన్‌దీప్ ధాల్‌‌ను ఎన్ ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ అరెస్టు చేసింది.

Update: 2023-03-02 07:51 GMT

దిశ , డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా బ్రిండ్‌కో సేల్స్ డైరెక్టర్ అమన్‌దీప్ ధాల్‌‌ను ఎన్ ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి అమన్ దీప్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. గురువారం అతడిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి సీబీఐ కస్టడీకి పంపిన తర్వాత ఈ అరెస్ట్ జరగడం ఆసక్తిగా మారింది.

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల్లో అమన్ దీప్ కూడా ఒకరు కావడం గమనార్హం. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం విజయ్ నాయర్, మనోజ్ రాయ్, అమన్ దీప్ ధాల్, సమీర్ మహేంద్రులు ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించి అమలు చేయడంలో చురుకుగా పాల్గొన్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమన్ దీప్ ధాలును ఈడీ అరెస్టు చేయడంతో తరువాతి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News