2 నెల‌ల‌ బిడ్డ కోసం యుద్ధ‌భూమికెళ్లిన `ఇండియ‌న్‌`!

ఆప‌ద‌లో ఆదుకున్నోళ్లే దేవుళ్లైనా దేవ‌త‌లైనా..! Indian man risks own life to enter Ukraine to help out refugees

Update: 2022-03-07 12:59 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఆప‌ద‌లో ఆదుకున్నోళ్లే దేవుళ్లైనా దేవ‌త‌లైనా! నిరాశనిస్పృహ‌ల మ‌ధ్య జీవితం ప్ర‌శ్నార్థ‌క‌మైన‌ప్పుడు ఇలాంటి పాజిటీవ్ కథనాలు గొప్ప ప్రేరణగా ఉంటాయి. రష్యా-ఉక్రెయిన్ల‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, రౌనక్ రావల్ అనే భారతీయుడు ఇలాంటి ఆశాజ్యోతిగానే నిలిస్తున్నాడు. తన జీవితాన్ని పణంగా పెట్టి ఓ తల్లిని, 2 నెలల బిడ్డ‌ను సురక్షితంగా కాపాడ‌టానికి యుద్ధ‌భూమిలోకి ఎంతో శ్ర‌మ‌లోర్చి వెళ్లాడు. వారిని క్షేమంగా స‌రిహ‌ద్దులు దాటించి, భ‌ళా..! అనిపించుకున్నాడు. రౌనక్ కథ హృద్యంగానే కాదు, స్ఫూర్తిదాయకంగా కూడా.

యుద్ధం మొద‌లైన‌ప్ప‌టి నుంచి రౌన‌క్ ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాడు. ఇటువంటి సంక్షోభ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న చాలా మంది విద్యార్థులకు రౌనక్ సహాయం చేశాడు. డెన్మార్క్‌లో నివసిస్తున్న రౌనక్ రావల్ యుద్ధంలో ఇబ్బంది ప‌డుతున్న‌వారికి స‌హాయం చేయ‌డానికి అక్క‌డికి వెళ్లాడు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, మహిళలు, చిన్నారులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళుతున్నాడు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఎవ్వ‌రికైనా రౌన‌క్ స‌హాయం కావ‌లిస్తే నిస్సందేహంగా ఫోన్ చేయొచ్చ‌ని చెబుతున్నారు అత‌ని నుంచి స‌హాయం పొందిన వ్య‌క్తులు. ఇంట‌ర్నెట్‌లో రౌన‌క్ ఓ రియ‌ల్ హీరో అయ్యాడు. అత‌ని పేరు ఇప్పుడు సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది.

Tags:    

Similar News