Wayanad byelection: పోటీ చేసిన తొలిసారే.. వయనాడ్ లో ప్రియాంక ఘన విజయం

కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకగాంధీ (Priyanka Gandhi) ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించారు.

Update: 2024-11-23 09:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకగాంధీ (Priyanka Gandhi) ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించారు. వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థి సత్యన్ మోఖరీపై 4.04లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ప్రియాంక గెలుపొందారు. ఉపఎన్నికలో ప్రియాంకకు 6 లక్షలకు పై చిలుకు ఓట్లు పడ్డాయి. బీజేపీ నుంచి పోటి చేసిన నవ్య హరిదాస్ మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు, వయనాడ్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గరి నుంచి ఈసారే పోలింగ్ శాతం అత్యల్పంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ శాతం 72.92 ఉండగా.. ఈ ఉపఎన్నికలో కేవలం 64.72 శాతంగానే ఉంది. కాగా.. ఈ ఎన్నికలో ప్రియాంకతో కలిపి 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

రాహుల్ ని దాటేసిన ప్రియాంక

అయితే, లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ రెండుచోట్ల రాహుల్ గాంధీ విజయం సాధించారు. కాగా.. రాహుల్ వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. ఆస్థానం నుంచే ప్రియాంక పోటీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు. వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్‌ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.


Read More..

Priyanka Gandhi Victory: ఇక ఎంపీ ప్రియాంక గాంధీ.. విజయంపై భర్త వాద్రా ఏమన్నారంటే..


Tags:    

Similar News