టూరిజంలో మాల్దీవులతో ఢీ.. లక్షద్వీప్‌కు అదనపు విమానాలు

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు భారత్ తన వ్యూహాత్మక నిర్ణయాలతో సమాధానమిస్తోంది.

Update: 2024-01-13 12:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు భారత్ తన వ్యూహాత్మక నిర్ణయాలతో సమాధానమిస్తోంది. మాల్దీవులకు ధీటుగా లక్షద్వీప్‌లో టూరిజంను డెవలప్ చేయడంపై భారత్ ఫోకస్ పెట్టిందనేలా ఈ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. లక్షద్వీప్‌కు సేవలందిస్తున్న ఏకైక విమానయాన సంస్థ ‘అలయన్స్ ఎయిర్’ తాజాగా కీలక ప్రకటన చేసింది. లక్షద్వీప్‌కు వెళ్లే టూరిస్టులు, ప్రయాణికుల సౌకర్యార్ధం ఇకపై అదనపు విమానాలను నడుపుతామని అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి తాము 70 సీట్లు కలిగిన ఒకే ఒక విమానాన్ని లక్షద్వీప్‌‌కు నడుపుతున్నామని తెలిపింది. ఒకే ఒక విమాన సర్వీసు ఫుల్ కెపాసిటీతో రోజూ నడుస్తోందని పేర్కొంది. దీనికి సంబంధించి మార్చి వరకు విమాన టికెట్లన్నీ ఇప్పటికే బుక్ అయ్యాయని.. అందుకే అదనపు విమాన సర్వీసులను నడపాలని డిసైడ్ చేశామని ‘అలయన్స్ ఎయిర్’ వెల్లడించింది. అదనపు విమానాలను వారానికి రెండు రోజులు(ఆది, బుధవారాల్లో) నడిపిస్తామని తెలిపింది. ‘అలయన్స్ ఎయిర్’ సంస్థ కేరళలోని కొచ్చి నుంచి లక్షద్వీప్‌లోని అగట్టి ద్వీపానికి విమాన సర్వీసులు నడుపుతోంది.

Tags:    

Similar News