మణిపూర్ వరదలపై హేట్ స్పీచ్.. చిక్కుల్లో తెలంగాణ ఇన్ ఫ్లూయెన్సర్

మణిపూర్ హింసపై చేసిన ప్రసంగంతో తెలంగాణకు చెందిన ఇన్ ఫ్లూయెన్సర్ మనోజ్ డేవిడ్ చిక్కుల్లో పడ్డారు. జాతిహింసకు గురైన మణిపూర్ లో ప్రకృతి వైపరీత్యాలు జరిగాలని కోరుతూ ప్రసంగం చేశారు.

Update: 2024-05-31 17:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ హింసపై చేసిన ప్రసంగంతో తెలంగాణకు చెందిన ఇన్ ఫ్లూయెన్సర్ మనోజ్ డేవిడ్ చిక్కుల్లో పడ్డారు. జాతిహింసకు గురైన మణిపూర్ లో ప్రకృతి వైపరీత్యాలు జరిగాలని కోరుతూ ప్రసంగం చేశారు. జులై 29, 2023లో మతబోధకుడైన మనోజ్ డేవిడ్ ఈ వీడియోని యూట్యూబ్ లో పోస్టు చేశారు. రెమాల్ తుఫాన్ వల్ల మణిపూర్ వరదలకు సంబంధించిన ఈ పాత వీడియో వైరల్ గా మారింది. మణిపూర్ లో దైవచింతన కలిగిన ప్రజలపై దాడులు జరుగుతున్నాయని మనోజ్ తన స్పీచ్ లో తెలిపారు. ఈ హింసపై దేవుడు తన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడని.. ఆయన మౌనంగా లేడని అన్నారు. అమాయక ప్రజలను చంపినందుకు రెండు రూపాల్లో దేవుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నారని ప్రసంగించారు. అందుకోసం తన ఇద్దరు దేవదూతలను పంపబోతున్నారని అన్నారు. ఆ ఇద్దరూ భూకంపాలు, వరదలను తెస్తున్నారని పేర్కొన్నారు. కాగా.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మణిపూర్ పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ద్వేషపూరిత ప్రసంగంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో వల్ల రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెరుగుతుందని పేర్కొన్నారు.


Similar News