జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో పూజలపై పిటిషన్.. హైకోర్టు ఏం చేయబోతోందంటే.. ?

దిశ, నేషనల్ బ్యూరో : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారం కొత్తకొత్త మలుపులు తిరుగుతోంది.

Update: 2024-02-15 18:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారం కొత్తకొత్త మలుపులు తిరుగుతోంది. మసీదు ప్రాంగణంలోని దక్షిణ సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ జనవరి 31న వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అదే రోజు రాత్రి నుంచి అక్కడ ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. అయితే ఈ ఆర్డర్స్‌ను సవాలు చేస్తూ జ్ఞానవాపి మసీదుకు చెందిన అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు‌లో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ‘‘జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని మిగిలిన సెల్లార్‌లపైనా మరో ఏఎస్‌ఐ(ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) సర్వే చేయడానికి ఆదేశించాలి’’ అని కోరుతూ హిందూవాది రాఖీ సింగ్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను గురువారం రోజు విచారణ కోసం న్యాయస్థానం ఎదుట లిస్టు చేశారు. అయితే ఒకే అంశంపై రెండు వర్గాలు పోటాపోటీ పిటిషన్లను దాఖలు చేసిన కారణంగా గురువారం పూర్తిస్థాయిలో అలహాబాద్ హైకోర్టు‌ విచారణ జరపలేకపోయింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఫిబ్రవరి 28న జరగబోయే విచారణ ప్రక్రియ కోసం ఆ రెండు పిటిషన్లను లిస్ట్ చేసింది. ‘‘గురువారం వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. అయితే తీర్పును వెలువరించే తేదీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు’’ అని రాఖీ సింగ్ తరపున న్యాయవాది హరిశంకర్ జైన్ వెల్లడించారు.

Tags:    

Similar News