Allahabad Court: హిందువుల వివాహ బంధం పవిత్రమైనది.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హిందూ వివాహాలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం ఒక పవిత్ర బంధమని, ఏడాదిలోపే విడాకులు ఇవ్వలేమని తెలిపింది.

Update: 2025-01-29 13:14 GMT
Allahabad Court: హిందువుల వివాహ బంధం పవిత్రమైనది.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: హిందూ వివాహాలపై అలహాబాద్ హైకోర్టు (Allahabad high court) కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువుల వివాహం ఒక పవిత్ర బంధమని, ఇరు వర్గాలు పరస్పరం అంగీకరించినా ఏడాదిలోపే విడాకులు ఇవ్వలేమని తెలిపింది. తీవ్ర పరిణామాలుంటే తప్ప దీనిని అంగీకరించలేమని పేర్కొంది. ఈ మేరకు భార్యా భర్తలు వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. నిశాంత్ భరద్వాజ్, రిషికా గౌతమ్ అనే జంట హిందూ వివాహ చట్టం (Hindu marriage act)-1955లోని సెక్షన్ 13-బీ ప్రకారం తమ వివాహాన్ని రద్దు చేయాలని సహరాన్‌పూర్‌ (Saharan poor) లోని ఫ్యామిలీ కోర్టు (Family court) లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే విడాకుల మంజూరీకి కనీస వ్యవధి ముగిసిపోలేదనే కారణంతో న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఫ్యామిలీ కోర్టు తీర్పును భార్యాభర్తలు హైకోర్టులో సవాల్ చేయగా జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా (Ashwani kumar Mishra), జస్టిస్ డోనాడి రమేష్‌ (Donadi ramesh)లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది.

విడాకుల కోసం దరఖాస్తు చేయడానికి హిందూ మ్యారేజ్ యాక్ట్‌లోని సెక్షన్ 14 ప్రకారం వివాహ తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు అసాధారణమైన పరిస్థితులు ఉంటే మాత్రమే అటువంటి పిటిషన్‌ను స్వీకరించొచ్చని తెలిపింది. ఏడాదిలోపు మాత్రం విడాకులు మంజూరు చేయలేమని పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. అయితే ఏడాది తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కోర్టు కల్పించింది. ఈ సందర్భంగా హిందూ వివాహాలపై వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహం ఒక పవిత్ర బంధమని తెలిపింది.

Tags:    

Similar News