Syria: సిరియాలోని భారతీయులందరూ సురక్షితం

డమాస్కస్‌లో భారత రాయబార కార్యాలయం పనిచేస్తూనే ఉందని వారు తెలిపారు

Update: 2024-12-08 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలో ఇస్లామిక్ తిరుగుబాటుదారులు దేశ రాజధాని డమాస్కస్‌ను చేజిక్కించుకున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ దేశాన్ని విడిచి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బషర్ అల్-అసద్ అధికారం నుంచి తొలగిన కొన్ని గంటల తర్వాత సిరియాలోని భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆదివారం ప్రకటనను విడుదల చేశాయి. డమాస్కస్‌లో భారత రాయబార కార్యాలయం పనిచేస్తూనే ఉందని వారు తెలిపారు. భారతీయ పౌరులందరితో రాయబార కార్యాలయం టచ్‌లో ఉందని, వారు సురక్షితంగా ఉన్నారని, వారికి సహాయం చేయడానికి రాయబార కార్యాలయం అందుబాటులో ఉందని వారు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం, సిరియాలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నారు, వీరిలో 14 మంది వివిధ ఐక్యరాజ్యసమితి సంస్థల్లో పనిచేస్తున్నారు. తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌పై నియంత్రణను దక్కించుకోవడంతో సిరియా ప్రభుత్వం ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలింది. అసద్ 50 ఏళ్ల కుటుంబ పాలనకు ముగింపు పలికి అజ్ఞాత ప్రదేశానికి పారిపోయినట్లు సమాచారం.  

Tags:    

Similar News