రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ బుకింగ్స్‌లో కీలక మార్పులు

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-04-11 08:10 GMT
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ బుకింగ్స్‌లో కీలక మార్పులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్స్‌లో పలు మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

అత్యవసర సమయాల్లో ప్రయాణించాలనుకునే వారి కోసం IRCTC తత్కాల్ టికెట్లను ప్రవేశపెట్టింది. తత్కాల్ టికెట్లు రైలు ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు లభిస్తాయి. ఏసీ తరగతులకైతే ప్రతి రోజు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ క్లాస్‌లకైతే ఉదయం 11 గంటలకు బుకింగ్ మొదలవుతుంది. ఈ విధానంలో లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే, తత్కాల్ సిస్టం ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్-సరఫరా అంతరాయాల కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ టైమింగ్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు విధానం సహా పలు అంశాల్లో మార్పులు చేసింది.

ఏప్రిల్ 15 నుంచి కూడా తత్కాల్ టికెట్ బుకింగ్స్ ఒక రోజు ముందుగానే చేసుకోవాలి. అయితే ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 11:00 గంటలకు, నాన్ ఏసీ /స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12:00 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. ఇక చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది.

తత్కాల్ టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?

* IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.

* ట్రైన్, క్లాస్ ఎంచుకోవాలి (ఏసీ/నాన్ ఏసీ)

* డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలక్ట్ చేసుకోవాలి.

* ప్రయాణీకుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

* చెల్లింపు పేజీకి వెళ్లి డబ్బులు చెల్లిస్తే బుక్తింగ్ పూర్తవుతుంది.

* ఒక తత్కాల్ PNR కింద గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News