Akhilesh yadav: కోల్‌కతా ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోంది.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు.

Update: 2024-08-16 14:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. ‘ఒక మహిళకు సంబంధించిన ఏదైనా సంఘటన విషాదకరం. మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి, ఆమె చర్యలు తీసుకుంటుంది. కానీ బీజేపీ దానిని రాజకీయ మైలేజీ కోసం వాడుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ఇతరులను అగౌరవ పరుస్తుందని మండిపడ్డారు. పాకిస్థాన్‌పై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..యోగి విదేశాంగ విధానం కంటే దేశీయ సమస్యలపై దృష్టి పెట్టాలని న్నారు. ఏదైనా దేశాన్ని భారత్‌లో విలీనం చేయడంపై చర్చించే ముందు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ 24 సీట్లు దక్కించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ప్రజలు బీజేనీ ఓడించడం ఖాయమన్నారు. బీజేపీ అవినీతిపరుల గుంపుగా మారిపోయిందని, కేవలం వాగ్దానాలు తప్ప ఇంకేం చేయడం లేదని విమర్శించారు. 

Tags:    

Similar News