Ayodhya: అత్యాచార బాధితురాలికి భద్రత కల్పించాలని కోర్టును ఆశ్రయించిన అఖిలేష్

అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగులోకి రాగా, దీనికి బాధ్యులుగా సమాజ్‌వాదీ పార్టీ భదర్స నగర్ అధ్యక్షుడు మోయిద్ ఖాన్, సర్వెంట్ రాజు ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు

Update: 2024-08-04 08:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగులోకి రాగా, దీనికి బాధ్యులుగా సమాజ్‌వాదీ పార్టీ భదర్స నగర్ అధ్యక్షుడు మోయిద్ ఖాన్, సర్వెంట్ రాజు ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విషయంపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, అత్యాచార బాధితురాలికి భద్రత కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. బాధితురాలికి ప్రభుత్వం సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య ఏర్పాట్లు చేయాలి. బాలిక జీవితాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత. కేసును సుమోటోగా స్వీకరించి కోర్టు పర్యవేక్షణలో అమ్మాయికి అన్ని విధాలుగా భద్రత కల్పించాలని కోర్టును ఆయన అభ్యర్థించారు.

మరో వైపు ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని తెర లేపింది. సమాజ్‌వాదీ పార్టీతో సంబంధం ఉన్న నిందితుడు మొయిద్ ఖాన్‌కు అఖిలేష్ యాదవ్ క్లీన్ చిట్ ఇచ్చారని బీజేపీ ఆరోపించింది. ఖాన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ బృందంలో భాగమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. దీనిపై స్పందించిన అఖిలేష్ ఇలాంటి కేసులను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి ప్రణాళికలను విజయవంతం చేయకూడదని అన్నారు. ఇదిలా ఉంటే శనివారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిందితుడు మోయిద్ ఖాన్‌కు చెందిన బేకరీని బుల్డోజర్‌తో ధ్వంసం చేసింది. అలాగే నిందితుడికి సంబంధించిన ఇతర అక్రమాస్తులను సైతం సీజ్ చేస్తామని సీఎం యోగి స్పష్టం చేశారు.

Tags:    

Similar News