Air polution : వాయు కాలుష్యం ఎఫెక్ట్.. హర్యానాలో ప్రైమరీ స్కూళ్ల మూసివేత
వాయు కాలుష్య తీవ్రత కారణంగా ప్రైమరీ స్కూళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో : వాయు కాలుష్య తీవ్రత కారణంగా ప్రైమరీ స్కూళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రైమరీ పాఠశాలలు ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన కొన్ని రోజులకే హర్యానా గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. హర్యానాలోని జింద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్ర స్థాయిలో నమోదైంది. పొరుగు రాష్ట్రామైన పంజాబ్‌లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. దేశ రాజధానిలో ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు ఏక్యూఐ ఉదయం తొమ్మది గంటలకు 407గా నమోదైంది.