Air India: బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న అల్లర్లు.. ఎయిరిండియా సంచలన నిర్ణయం

రిజర్వేషన్ల అమలు విషయంలో తలెత్తిన వివాదం బంగ్లాదేశ్‌లో మారణ హోమానికి దారి తీసింది.

Update: 2024-08-06 02:49 GMT
Air India: బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న అల్లర్లు.. ఎయిరిండియా సంచలన నిర్ణయం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వేషన్ల అమలు విషయంలో తలెత్తిన వివాదం బంగ్లాదేశ్‌లో మారణ హోమానికి దారి తీసింది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అదేవిధంగా ప్రధాని, చీఫ్ జస్టిస్ నివాసాలను ఆందోళనకారులు లూఠీ చేశారు. ఈ క్రమంలో ఎయిరిండియా విమానయాన సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు విమానాల రాకపోకలను పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు ఎయిరిండియా ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఢాకాకు విమానాల రాకపోకల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బంగ్లాదేశ్‌లో పరిస్థితిని తాము సమీక్షిస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. ఇండియా నుంచి ఢాకాకు, ఢాకా నుంచి ఇండియాకు ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ప్రయాణన్ని రద్దు చేసుకుంటే చార్జీల నుంచి పూర్తి మినహాయింపును ఇస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News