AICC: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పిటిషన్.. కొట్టివేసిన వారాణాసి కోర్టు

సిక్కుల(Sikhs) పరిస్థితిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్(FIR Against Rahul Gandhi) నమోదు చేయాలని దాఖలైన పిటిషన్ ను వారాణిసి కోర్టు(Varanasi Court) తిరస్కరించింది(Rejected).

Update: 2024-11-29 07:38 GMT

దిశ, వెబ్ డెస్క్: సిక్కుల(Sikhs) పరిస్థితిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్(FIR Against Rahul Gandhi) నమోదు చేయాలని దాఖలైన పిటిషన్ ను వారాణిసి కోర్టు(Varanasi Court) తిరస్కరించింది(Rejected). గత సంవత్సరం సెప్టెంబర్ 10న అమెరికా పర్యటన(America Tour)లో భాగంగా వాషింగ్టన్ డీసీ(Washington DC)లో ప్రసంగించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత దేశంలో సిక్కుల పరిస్థితిపై వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారతదేశంలోని సిక్కుల్లో అభద్రతా భావం నెలకొందని, రాహుల్ గాంధీ అభ్యంతరకర ప్రకటన చేశారని, ఆయనపై కేసు నమోదు చేయాలని నాగేశ్వర్ మిశ్రా(Nageshwar Mishra) అనే వ్యక్తి పిటిషన్(Petition) దాఖలు చేశారు.

దీనిపై విచారించిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ త్రిపాఠి(Additional Chief Judicial Magistrate Neeraj Kumar Tripathi) ఈ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 208 ప్రకారం, భారతదేశం వెలుపల చేసిన ఆరోపణ నేరాన్ని ముందస్తు అనుమతి లేకుండా విచారించడం సాధ్యం కాదని చెబుతూ పిటిషన్ ను కొట్టివేశారు. కాగా రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా.. భారత దేశంలో ఒక సిక్కు తలపాగా ధరించడానికి, కారా ధరించడానికి, గురుద్వారా వెళ్లడానికి కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అన్ని మతాలలో ఇలాగే జరుగుతోందని వ్యాఖ్యానించారు.

 

Tags:    

Similar News