Udhayanidhi : 2026లో గెలిచేది మేమే.. విజయ్‌కు ఉదయనిధి వార్నింగ్

దిశ, నేషనల్ బ్యూరో : కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న నటుడు విజయ్‌(Vijay)కు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-11-06 14:29 GMT
Udhayanidhi : 2026లో గెలిచేది మేమే.. విజయ్‌కు ఉదయనిధి వార్నింగ్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న నటుడు విజయ్‌(Vijay)కు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా డీఎంకే గెలిచి తీరుతుందని.. తమను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకీ లేదన్నారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.

నటుడు విజయ్ రాజకీయ ప్రవేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘వాళ్లు ఎవరితో చేతులు కలిపినా ఫర్వాలేదు. ఎక్కడి నుంచి వచ్చినా ఫర్వాలేదు.. అది ఢిల్లీ అయినా, గల్లీ అయినా, గెలిచేది మాత్రం డీఎంకే’’ అని ఉదయనిధి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘విజయ్ నాకు చాలా పాత ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి నాకు ఆయన తెలుసు. నా ప్రొడక్షన్ హౌస్ మొదటి సినిమాను విజయ్‌తోనే తీశాను. ఎప్పటికీ ఆయన నా ఆప్తమిత్రుడే. రాజకీయాల్లో వచ్చినందుకు విజయ్‌కు నా అభినందనలు’’ అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News